ప్రతి ఎకరానికి వచ్చేదిగుబడిని మరియు ఆదాయాన్ని పెంచడానికి మరియు సాగు ఖర్చులను తగ్గించడానికి క్రిష్-e సలహా సేవ రైతులకు సహాయపడుతుంది.

పంట చక్రం యొక్క ప్రతి దశలో, ఉత్పాదక అవకాశాలను తెలుపుటకు మా సలహా బృందంలోని నిపుణులు రైతులకు సహాయం చేస్తారు. వారు తమ పొలంలో పరికరాలు, సాంకేతికత మరియు ఆధునిక ప్రక్రియలను ఉపయోగించడానికి రైతులకు మార్గనిర్దేశం మరియు సహాయం చేస్తారు.

950 క్రిష్-e టక్నీక్ ప్లాట్లు, మన నైపుణ్యం మరియు ఆలోచనలలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాయి:

మా అడ్వైజరీ సర్వీస్, గత 2 సంవత్సరాలలో భారతదేశమంతా విస్తరించి ఉన్న వివిధ పంటలు పండించే 950కి పైగా వ్యవసాయదారులతో పనిచేసింది. ‘టక్నీక్ ప్లాట్లు’ క్రిష్-e నైపుణ్యం మరియు ఆలోచనలతో వ్యవసాయం ఎలా చేయాలి అనే విషయాన్ని రైతులకు చూపించడం జరిగింది. క్రిష్-e వ్యవసాయ విధానం ఉపయోగించడం వల్ల తమ క్షేత్రాలలో ఎకరానికి వచ్చే ఆదాయంలో పెరుగుదల ఎలా సంభవించిందో స్వయంగా తెలుసుకొన్నారు.

క్రిష్-e వ్యవసాయ శాస్త్రవేత్తల అడ్వైజరీ బృందం మరియు రాయబారులు, రైతులకు నైపుణ్యన్ని మరియు అనుభవాన్ని సులభంగా అందించారు:

వ్యవసాయ శాస్త్రవేత్తలు, శాస్త్రీయ పరిజ్ఞానం అందించగా, రాయబారులు, క్షేత్రంలో పనిచేసే అనుభవాన్ని అందిస్తారు. దీనికి మీ అనుభవం తోడైతే, మీ పంట క్షేత్రాలలో ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.

రైతులకు, నైపుణ్యం మరియు పరిష్కారాలు సులభంగా లభ్యమయ్యేందుకు ప్రత్యేక యాప్‌ల ద్వారా 24 x 7 మార్గదర్శన్ కూడా అందించబడుతోంది.

మా సహాయక్‌తో మాట్లాడటానికి మరియు బుకింగ్ చేయడానికి 1800-266-1555కు కాల్ చేయండి.

క్రిష్-e తో పెరగడం

క్రిష్-e మిలియన్లకొద్దీ విజేతలైన రైతులను తయారుచేసే నూతన శకానికి నాంది పలికింది

భారతీయ వ్యవసాయ రంగంలో మార్పులు తేవడంద్వారా, మిలియన్లకొద్దీ రైతులు తమ పంట క్షేత్రంనుండి ఉత్తమ ఉత్పాదన, లాభాలు అందించడమే లక్ష్యంగా క్రిష్-e ముందుకు వెళుతోంది.

కైలాస్ మోరె గ్రామం - పూరీ

జిల్లా - ఔరంగాబాద్

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన శ్రీ కైలాస్ మోరె, క్రిష్-e టక్నీక్ ప్లాట్ రైతు. 8 నెలల క్రితం, ఈయన తన పంటకు క్రిష్-e చెరకు డిజిటల్ కేలండర్ తీసుకొన్నాడు. క్రిష్-e అడ్వైజరీ మరియు యాప్ మద్దతు తీసుకొన్నాడు, ప్రస్తుతం ఆయన చెరకు పంట కాండం పరిమాణం 7.5 అంగుళాలు మరియు చుట్టుకొలత 3.5 అంగుళాలు ఉంది. ఇది స్థలం తయారీ, విత్తనాల ఎంపిక, విత్తనాల శుద్ధి, మరెన్నో ఉండే చక్కని పంట యాజమాన్యానికి సూచనలుగా చెప్పవచ్చు, దీనివల్ల ఆయనకు గత సంవత్సరంతో పోలిస్తే, ఖర్చులో దాదాపు 12% వరకు ఆదా అయింది.

అంకుష్ డాడ్మైస్ గ్రామం - సదోబచ్చివాడి బారామతి

జిల్లా - పూనె

పూనెలోని సదోబచ్చివాడి బారామతి గ్రామానికి చెందిన శ్రీ అంకుష్ డాడ్మైస్, ఇప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న ఒక రైతు, ఈయన తన పంటలను రక్షించుకొనేందుకు క్రిష్-e చక్కెర డిజిటల్ అడ్వైజరీని ఉపయోగించుకొన్నారు. ఈయన మేము వివిధ సమయాలలో చేసే స్థలం తయారీ, విత్తనాల ఎంపిక, విత్తనాల శుద్ధి, సేంద్రీయ + ఫాస్ఫారిక్ ఆమ్లాలను తిరిగి వినియోగించే అన్ని పనులు చేశారు. ఈ విధానాల సహాయంతో ప్రస్తుతం ఆయన చెప్పుకోదగిన సంఖ్యలో టిల్లర్లను అంటే సుమారుగా 7-8 ఉపయోగిస్తున్నారు, దీనివల్ల ఆయన 80% వరకు మొలకలు పొందగలుగుతున్నారు.

దారా ప్రతాప్ సింగ్ రఘుబన్షీ గ్రామం - గ్రేటియా

జిల్లా - ఛింద్వారా

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో ఉన్న గ్రేటియా తెహ్‌సీల్-చౌరాయ్ గ్రామానికి చెందిన శ్రీ దారా ప్రతాప్ సింగ్ రఘుబన్షీ, సంస్కరణలను స్వాగతించే ఒకరైతు, ఈయన క్రిష్-e బృందం సహాయంతో యాంత్రికీకరణ విధానాలను అమలు పరచాడు. న్యూమటిక్ ప్లాంటర్స్ ఉపయోగించడం వల్ల బాగా లోతుగా విత్తనం వేయడం, విత్తనానికి, విత్తనానికి మధ్య మరియు వరుస, వరుసల మధ్య సరైన దూరం ఉంచడం సాధ్యమయింది. దీనివల్ల మొక్కలు సమానంగా చిగురించి, హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గింది.

హేమంత్ వర్మ గ్రామం - హతోడ

జిల్లా - ఛింద్వారా

హేమంత్ వర్మను కలుద్దాం. మధ్యప్రదేశ్‌లోని హతోడ గ్రామానికి చెందిన ఈయన పెరుగుదలపై దృష్టి ఎక్కువగా నిలిపే రైతు. క్రిష్-e బృందం అందించిన సహాయం మరియు మార్గదర్శత్వంలో ఆయన, స్థల తయారీ మరియు పంట దిగుబడి వంటి వాటిలో క్రిష్-e వ్యవసాయ విధానాలను అమలు పరచారు. ఈ విధానాలను ఉపయోగించడం వల్ల ఆయన పంటలు విశేషంగా పెరిగి, గత సంవత్సరంతో పోల్చిచూస్తే అధిక దిబుబడి వచ్చే అవకాశం ఉంది.

మనోజ్‌భాయ్ గణేష్‌భాయ్ భేసదాడియా గ్రామం - మోతీ బనుగర్

జిల్లా - జామ్ నగర్

ఆరంభంలో మనోజ్‌భాయ్ గణేష్‌భాయ్ భేసదాడియా సంప్రదాయ విధానాలను ఉపయోగించి పంటపొలాలను సాగు చేయడం, వరదనీటితో సాగు వంటి విధానాలు అమలుపరచేవారు, అంతేగాక, రసాయన ఎరువుల వినియోగంపై నియంత్రణ లేకపోవడం వల్ల పంటసాగుకు అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉండేది. కాని కొత్తదాన్ని ఆహ్వానించాలన్న ఆయన ఆలోచనావిధానం మరియు నూతన మరియు సృజనాత్మక విధానాలను నేర్చుకోవాలన్న ఆలోచన, పరిస్థితులను ఆయనకు అనుగుణంగా మార్చాయి. క్రిష్-e బృందం సహాయం మరియు మార్గదర్శకాలవల్ల ప్రస్తుతం ఆయన ఎంఐఎస్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, క్రిష్-e సహకారంతో కెవికె పంట రక్షణ బృందం అందిందిన వ్యవసాయ సేవల ఆధారంగా పత్తిని సాగుచేస్తున్నారు.

రమేష్‌భాయ్ గోర్థన్‌భాయ్ చొవాటియా గ్రామం - మోటా తవారియా

జిల్లా - జామ్ నగర్

సంప్రదాయ విధానాలు మరియు నీటిసాగు విధానాలు అమలు పరచడం వల్ల శ్రీ రమేష్‌భాయ్ గోర్థన్‌భాయ్ చొవాటియాకు ఉపయోగించే రసాయన ఎరువులకు అయ్యే ఖర్చు విపరీతంగా ఉండి తద్వారా, పంట సాగు ఖర్చు అధికంగా ఉండేది. అంతేగాక, వర్షాభావ పరిస్థితులు, నీటివనరులు సరిగా లేకపోవడం వల్ల పత్తి దిగుబడి ఆయన అనుకొన్నదానికంటే తక్కువగా ఉండేది. పత్తి పంటలను ఎలా సాగుచేయాలి అనే వాటిగురించి స్పష్టమైన అవగాహన, వివిధ రసాయన మరియు నీటిలో కరిగే ఎరువులను ఎలా వినియోగించాలి అన్నదాన్ని తెలుసుకోవడం, తరచు క్రిష్-e బృందం జరిపే క్షేత్ర సందర్శన వల్ల, ప్రస్తుతం పత్తిసాగుతో, ఆయన పెట్టుబడికి వస్తున్న ఆదాయంతో ఆయన సంతోషంగా ఉన్నారు.

పేనుగంటి పాపారావు గ్రామం - ఎండగంటి

జిల్లా - పశ్చిమ గోదావరి

ఆంద్రప్రదేశ్‌, ఎండగంటి గ్రామానికి చెందిన శ్రీ పేనుగంటి పాపారావు, ఆధునిక వ్యవసాయ విధానాలను ఉపయోగించి, అభివృద్ధి చేపట్టాలన్న దృక్పథం కలిగివున్న ఒక ఆధునిక రైతు. క్రిష్-e బృందం సహాయంతో, ఆయన తన క్షేత్రంలో యాంత్రికీకరించిన వరి నాటే విధానాన్ని అమలుపరచడంతోపాటు, మాట్ నర్సరీ కూడా చేపట్టారు. ఫలితం – ఉత్పాదన 3525 కిలో/ఎకరాలు లనుండి 3750 కిలో/ఎకరాలుకు పెరిగింది.